![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -648 లో....ఇక కుటుంబంలో ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయినట్లే కదా అని అపర్ణ అనగానే.. లేదు అసలు సమస్య ఇంకా ఉంది. ఆస్తులు వాటా పంచాలని నిర్ణయం తీసుకున్నానని సీతారామయ్య అంటాడు. దాంతో ప్రకాష్ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. అందరు వద్దని అనడంతో సరే అందరు కలిసి ఉండాలి.. అందరు అంటే అప్పు, కళ్యాణ్ కూడా అని సీతారామయ్య అంటాడు. సరే అని ప్రకాష్ అంటాడు. నువ్వు అంటే సరిపోదు ధాన్యలక్ష్మి కూడా అనాలని సీతారామయ్య అనగానే.. నేను ఒప్పుకుంటున్నాను.. నా కొడుకు సంతోషంగా ఉండడం నాకు కావాలని ధాన్యలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత దాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాణి వచ్చి ఏంటి ఇలా మారిపోయావని అడుగుతుంది. ఆస్తులలో వాటా కావాలని అడగలేదు అని రుద్రాణి అనగానే నువ్వు అడగొచ్చు కదా.. నేను అడిగితే అందరికి నెగిటివ్ అవుతున్నాను.. నేనేం చెయ్యాలో నాకు తెలుసని ధాన్యలక్ష్మి అంటుంది. మరొకవైపు కళ్యాణ్ అప్పుల దగ్గరికి ధాన్యలక్ష్మి, ప్రకాష్ లు వచ్చి తమతో రమ్మని రిక్వెస్ట్ చేస్తారు. దాంతో వాళ్ళు కూడా సరే అంటారు. స్వప్న దగ్గరికి రుద్రాణి వచ్చి కౌంటర్ వెయ్యాలని చూస్తుంది కానీ తనే స్వప్నతో మాటలు పడుతుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ వస్తుంటారు. దాంతో కావ్యని స్వప్న హారతి తీసుకొని రమ్మంటుంది. కావ్య ఇద్దరిని గుమ్మంలోనే ఆపి హారతి ఇచ్చి.. మీరు మీ పేర్లు చెప్పి రండి అని కావ్య అంటుంది. దాంతో వాళ్ళు పేర్లు చెప్పి లోపలికి వస్తారు. ఆ తర్వాత వెనకలే వస్తున్న ధాన్యలక్ష్మి, ప్రకాష్ లని కావ్య ఆపి వాళ్ళని కూడా పేర్లు చెప్పి రమ్మని అంటుంది. వాళ్ళు పేర్లు చెప్పి లోపలికి వస్తారు. అందరు సరదాగా ఉంటారు.
ఎన్నో గొడవలకి కారణం అయిన ఈ రుద్రాణిని తన కొడుకుని బయటకు పంపాలనుకుంటున్నానని ఇందిరాదేవి అనగానే.. దానికి అందరు ఒప్పుకుంటారు. నా వాటా నాకు ఇవ్వండి వెళ్తానని రుద్రాణి అనగానే.. నీ కళ్ళలో బాధ కనబడుతుందనుకున్న కానీ ఇలా వాటా అంటున్నావ్.. నా భార్య అన్న దాంట్లో తప్పేం లేదని సీతారామయ్య అంటాడు. మీకు ఆస్తులలో వాటా లేదు. ఇక బయల్దేరండి అని సీతారామయ్య అనగానే.. ఇగో పోతే అడుక్కొని తినాలని రుద్రాణి అనుకుని సీతారామయ్య కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తుంది. తరువాయి భాగం లో కంపెనీని తగలబెడుతున్నానని రుద్రాణికి అనామిక ఫోన్ చేసి చెప్తుంది. రాజ్ కీ ఆఫీస్ వాళ్ళు ఆ విషయం చెప్తారు. దాంతో రాజ్ కంగారుగా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |